దప్పిక తీర్చే అమృతం వంటి చల్లని నీటిఊటలు
వేసవితాపాన్ని హరించే చలువ పందిళ్ళలోని జలభాండాలు
బాటసారుల ప్రాణాలను నిలిపే
ఉదకనిధులు
కులమతాలకతీతంగా కూడళ్ళలో కొలువుదీరు నీటినిల్వలు
మానవసేవే మాధవసేవను దాతృత్వానికి ప్రతీకలు
గొంతు తడిపి మేనుకు చల్లదనాన్ని కల్గించు కలియుగ
ప్రత్యక్ష తీర్థములు
చలివేంద్రాలు మానవాళి పాలిట
కామధేనువులు
వేదవిహిత ఋక్కులకు నిదర్శనాలు
మహిని మానవత్వపు చిరునామాలు
సాధుజన కర్మలకు నిలయాలు
దైవకృపకు పాత్రమగు తావులు
మట్టి కుండల్లో నిక్షిప్తమైన పుణ్య
పురుషార్థములు
సంస్కృతీ,సంప్రదాయాలకు నిలువెత్తు తార్కాణాలు
నాగరికతక,సంస్కారాలకు కట్టించిన దేవాలయాలు
ప్రేమ,కరుణ,ధర్మాలకు వ్రాసి ఉంచిన సాక్ష్యాలు
మనుగడకు,మన్ననకు మహనీయమగు మార్గదర్శనాలు.
జలదానం జీవదానమై ఆత్మలను పరమాత్మ కడకు చేర్చు సాధనాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి