లేతచిరు గాలులకి ఆకులు కదిలి
చూపరులను హాయిగా పలకరిస్తున్నాయి
చివురుకొమ్మల నడుమ దాగినవిరులు
పరిమళాలతో తీయగా పలకరిస్తున్నాయి
గుబురుగున్నమావిపై జోడుగువ్వలు
కిలకిలలతో పరవశంగా పలకరిస్తున్నాయి
భ్రమరాలు గోముగా తేనియలు
సేవిస్తూ మత్తుగా పలకరిస్తున్నాయి
సెలయేళ్ళు లేళ్లలా ఉరకలేస్తూ
సోయగంతో అల్లరిగా పలకరిస్తున్నాయి
కలతనిదురలో కదిలేనీతలపులు
సమ్మోహనంగా నను పలకరిస్తున్నాయి
చిక్కనితిమిరంలా నీమౌనం
నిరాశాలవెల్లువలో నన్ను ముంచే స్తుంది
జతచేరే కౌగిలిలో జాబిలిని అందితే
వెన్నెలధారలు కురిపిస్తూ రాత్రిపలకరిస్తుంది
నీవే జాబిలివై ఆకాశంలో దాగిపోతే
నిన్నేమని నేను పలకరించాలి?...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి