--ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
--పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి
--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
ప్రభుత్వ పాఠశాలలు ప్రజల సమిష్టి ఆస్తి అని, ప్రజల సహకారంతోనే అవి అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. గురువారం చివరి పని దినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పిటిఎం) ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలకు తల్లిదండ్రులు, గ్రామస్తుల సమక్షంలో ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. రాష్ట్రస్థాయి తెలుగు పద్యాల పోటీల్లో గెలుపొందిన పొన్నాల శ్రీనిధి, తోట ఆరూహిలకు, గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి సీటు పొందిన తోట ఆరాధ్య, తోట ఆరూహి, బండారి స్వేచ్ఛ, చీర రుతిక, రితికలకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. పాఠశాలకు ఎక్కువ రోజులు హాజరైన వారు, వివిధ అంశాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో 10 కంప్యూటర్లతో పిల్లలకు కంప్యూటర్ విద్యను అందిస్తామని, లక్షా ఏడు వేల రూపాయల విలువైన ఇంటరాక్టివ్ పానెల్ (స్మార్ట్ టీవీ) ద్వారా తరగతుల్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. స్మైల్ ఫౌండేషన్ ద్వారా పాఠశాలలో రూ.7 లక్షల విలువైన సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని, పిల్లల సౌకర్యం కోసం ప్రతి తరగతి గదిలో ఏసీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భద్రత, రక్షణ కోసం పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పాఠశాలలో విద్యాపరమైన సేవలు అందించిన గోపిశెట్టి సుప్రియ, బండారి సరితలను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల చైర్పర్సన్ పెండ్లి స్వరూప, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, బండారి సరిత, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి