శ్రీకాకుళం శ్రీకోదండ రామాలయ ప్రాంగణంలో గురువారం సాయంత్రం జరిగిన శ్రీరామ దర్బారులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చౌధరి రాధాకృష్ణ గానం చేసిన "ఆదర్శనీయురాలు సీతాదేవి" కవిత నిర్వాహకుల ప్రేక్షకుల ప్రశంసలనందుకుంది.
ఉపనిషన్మందిరం వజ్రోత్సవాల సందర్భంగా శ్రీ కోదండ రామాలయం గోష్టి సభ్యులతో కలసి నిర్వహించిన శ్రీరామ దర్బారులో చౌధరి రాధాకృష్ణ సీతాదేవి జీవన గమనంలో ఆదర్శం, ధైర్యం, పవిత్రత వంటి ఉన్నత లక్షణాలతో యుగ యుగాలుగా మానవాళికి మార్గదర్శకులయ్యారని పేర్కొన్నారు.
ఆదికవి వాల్మీకి రామాయణాన్ని సీతాదేవి జీవితగాథగా పేర్కొన్నారని రాధాకృష్ణ గుర్తు చేసారు. అకారణ వైరం ఎవరితోనూ పనికిరాదని సీతాదేవి భర్త శ్రీరాముని హెచ్చరించారని, శ్రీలంకలో ముందస్తు సమాచారానికై ఆమె విభీషణుని సతీమణి సరసతో చెలిమి చేసారని, శ్రీరాముడు, లవ కుశలు కలిసే వేళ ఆమె తన అవతారం చాలించాలని భావించి భూమాతలో లీనమయ్యారని సీతాదేవి జీవన గమనాన్ని వివరించారు.
నిష్టల నరసింహమూర్తి
శ్రీ రఘువీర గద్యంతో ప్రారంభమైన కార్యక్రమం శ్రీరామ, ఆంజనేయ, సీతాదేవిలను కీర్తిస్తూ సుమారు 40మంది ఆలపించిన పాటలు, పద్యాలు, కవితలు, కీర్తనలతో సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న కవి, గాయకులను నిర్వాహకులు ఉచిత రీతిని సత్కరించగా అర్చకస్వాములు తీర్ధ, ప్రసాదాలను అందజేసారు.
డా.బారువ కోమలరావు కార్యక్రమాన్ని నిర్వహించగా ఉపనిషన్మందిరం, శ్రీ కోదండ రామాలయం ప్రతినిధులు సహకరించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి