-ఊషన్నపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థి జన్మదిన వేడుకలు
పాఠశాల పిల్లలు మంచి అలవాట్లను కలిగి ఉండటంతో పాటు అనుక్షణం జ్ఞానాన్వేషణ చేయాలని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. బుధవారం కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి పెండ్లి నితీష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.తన జన్మదినం సందర్భంగా అందంగా ముస్తాబై పాఠశాలకు వచ్చిన బాలుడు నితీష్ తోటి సహచరులతో కలిసి సంతోషంగా గడిపారు. నితీష్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో విలసిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. వారు స్వీట్లు తినిపించి, అబ్బాయిని దీవించి, ఆశీర్వదించారు. అతనికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పిల్లల సంతోషం కోసమే పాఠశాలలోని ప్రతి విద్యార్థి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. చేయాలన్నారు.ప్రజల భాగస్వామ్యంతోనే పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని,ఊషన్నపల్లి పాఠశాల
అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లల చదువు, సంస్కారం, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, సకల కళలతో పాటు వారి సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. సకల సౌకర్యాలతోపాటుగా, చక్కటి ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్న ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే పిల్లల్ని చదివించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, తల్లిదండ్రులు, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి