ప్యాక్ట్ సంస్థ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ రాష్ట్రస్థాయి తెలుగు నీతి పద్యాల పోటీలో పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం, ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థినిలు తోట ఆరూహి, పొన్నాల శ్రీనిధిలు అత్యంత ప్రతిభ కనపరిచి విజయం సాధించారు. పాఠశాల నుంచి విద్యార్థినిల నీతి పద్యాల వీడియోలను పోటీకి పంపించామని, ఈ పోటీలో 150 మంది పోటీ పడగా, ఊషన్నపల్లి పాఠశాలకు చెందిన పిల్లలిద్దరు రాష్ట్ర స్థాయి పోటీలో విజయం సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పోటీలో గెలుపొందిన వీరిద్దరి నగదు, ప్రశంస పత్రాలను ఆన్లైన్లో సంస్థ నిర్వాహకులు యేభూషి సతీష్ కుమార్ పంపించగా, బుధవారం గంగారం గ్రామ సర్పంచి రేకుల జ్యోతి రఘు ప్రోత్సాహక నగదుతో పాటు ప్రశంసా పత్రాలను పాఠశాల పిల్లలకు అందజేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఫ్యాక్ట్ సంస్థ గత నెల 30వ తేదీ వరకు 3 విభాగాల్లో రాష్ట్రస్థాయి నీతి పద్యాల పోటీలకు నామినేషన్లు కోరగా, తోట ఆరూహి, పొన్నాల శ్రీనిధిల వీడియోలను ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య పంపించారు. ఆన్లైన్ లో రాష్ట్రస్థాయి నీతి పద్యాల పోటీలో ఊషన్నపల్లి పాఠశాల చిన్నారులు తోట ఆరూహి, పొన్నాల శ్రీనిధి విజయం సాధించడం పట్ల ఎంఈఓ సిరిమల్ల మహేష్, ఎంపీడివో రామ్మోహన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతి రఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్, వార్డు సభ్యులు ఆవుల సునీత, ముస్కె కుమార స్వామి, కూస లత, ముస్కు అంజయ్య, చంచల వనిత, ముస్కు స్రవంతి, పాఠశాల ఛైర్ పర్సన్ పెండ్లి స్వరూప, సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, బండారి సరిత, అధికారులు, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, యువజన సంఘాల నాయకులు, సభ్యులు, పలువురు హర్షం వ్యక్తం చేసి, పిల్లలిద్దరిని అభినందించారు. పాఠశాల పిల్లలకు పోటీలు నిర్వహించి, వారిని ప్రోత్సహిస్తున్న ఫ్యాక్ట్ జమ్మికుంట యాజమాన్యానికి ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రస్థాయి పద్యాల పోటీలో ఊషన్నపల్లి పాఠశాల పిల్లల ప్రతిభ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి