దహించే బాధలను
సహించే సహనాన్ని
భరించే ఓపిక లేని
భారమైన క్షణాలకు..
ఆరాటపడిన రేయిని
అలవాటు పడిన మనసుని
అదుపు చేయలేక
ఆవరించిన అశక్తతను
తరిమేసే వెలుగేదో
త్వరగా రావాలని
వరమై సమయము
కలిసి రావాలని..
తీరని కోరికలు తీరే
దారేదో దొరకాలనీ
కలతల కలలకు
కన్నులు సెలవివ్వాలని..
అడుగులకు కొత్తగా
ఉత్సాహం వచ్చేలా
అంతరంగపు వేదన
అడుగంటా పోవాలని
అడిగిన మనసును
ఆప్యాయంగా హత్తుకుని
అన్నిటా నేను నీకు తోడై
ఉంటానంటూ వచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి