ఏవీ , ఆ..గతస్మృతులఖజానాలు...!ఎక్కడ, ఎంత వెదికినా,కనిపించవేమిటి ?ఆనాటి అనుబంధాలు ,ఆత్మీయతలు ,ప్రేమపూర్వకమైన పలకరింపులు ,బంధువులుతో కళకళలాడే లోగిళ్ళు ,రంగవల్లులతో స్వాగతం పలికినవిశాలమైన వాకిళ్ళు !ఏవీ..ఆనాటి జ్ఞాపకాలు,మల్లె పువ్వు కన్నా _స్వచ్చమైన మనసులు ,త్యాగము తప్ప స్వార్థం లేని మనస్తత్వాలు !ఏవీ, ఎక్కడ,ఆ..అనుభూతులు,ఆరు భయట హాయిగానిద్ర పోయిన రాత్రులు ,వీధి అరుగు పై కూర్చుని మాట్లాడుకున్న మంచి,చెడ్డలు !బామ్మలు చెప్పిన రామాయణ, భాగవత కథలు,తాతయ్య చెప్పినసామెతలు ,పొడుపు కథలు ,పెద్దలు బోధించిన నీతి సూత్రాలు!ఏవీ..నాటి తీపి గుర్తులు,ఆదివారం , వీధి అరుగు పై, కూర్చునివిన్న _ఆకాశవాణి నాటకాలు,అందరినీ అక్కున చేర్చుకునేవిశాల హృదయాలు !ఏవీ, ఎక్కడ.....కల్మషం లేని మనసులు -ప్రేమను పంచే మమతలు !తెల్లవారుఝామున కూసేకోడి కూతలు ,ఇసుక తిన్నె పైన వ్రాసినచేతి రాతులు,మనసుకు ఆహ్లాదం కలిగించేహరికథలు, బుర్రకథలు,తోలు బొమ్మలాటలు ,చెవులకు వీనులవిందైనఅర్థవంతమైన గీతాలు ,కథా బలంతో గుండెను బరువెక్కించేచలన చిత్రాలు!ఏవీ, ఎక్కడ ...బావా మరదళ్ల మోటు సరసాలు ,బావమరిది_ బావ గారితో ఆడేవేళా కోలా లు...యువతను ఉర్రూతలూగించినభోగం మేళాలు,జాతరలో మ్రోగించినభాజా భజంత్రీలు!తల్లిదండ్రుల ప్రేమలేఆస్తిగా భావించే నాటి తరాలుఏవీ ఎక్కడ......!?***
మాయమైపోయిన మధుర స్మృతులు.....!!: - -యెనుముల వేణుగోపాలరావు - అమలాపురం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి