అతివేగం,తొందరపాటు,అత్యుత్సాహం
ప్రాణనష్టానికి హేతువులు,
మైనర్లు చేసే విన్యాసాలతో జరుగు రోడ్డుప్రమాదాలు.
తాగి నడిపే వారి విచక్షణలేమితో
ఇరకాటాలు,
వచ్చీ,రానీ డ్రైవింగుతో కలుగు నష్టాలు.
రోడ్డు ప్రయాణానికి అనేక నిబంధనలు,
కానీ పాటించడానికే మీనమేషాలు.
అర్థాయుష్షులతో దుర్మరణాలైన మారని మనుషులు,
అసౌకర్యమైన రోడ్లు మరో కోణం.
గమ్యాన్ని అతి తొందరగా చేరుకోవడానికి వక్రమార్గాలు,
తాము చచ్చేది కాక ఇతరుల ప్రాణాలు హరించు వైనాలు,
ఇంటి దగ్గర ఎదురుచూసే కుటుంబం ఉందనే స్పృహ రావాలి.
గమ్యం సురక్షితంగా చేరుకోవాలి ప్రాణాలతో.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి