మై డియర్....: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 ప్రియసఖీ!నీ తలపు రాగానే
మధురమైన భావన కల్గుతుంది.
నీ మోముపై సందడి చేసే ముంగురులు,
నీ పెదవులపై నాట్యం చేసే చిరునవ్వులు,
అనేక భావాలనొలికించే నీ కళ్ళు,
కనుబొమల మధ్య వెలిగే ఎర్రని బొట్టు,
ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మాటలు,
ప్రేమతో స్పర్శించే చేతులు,
బాగున్నావని,బాగుంటావని,
బాగుండాలని నీ కుశలాన్ని కాంక్షిస్తున్నాను.
నీ రాక,మన కలయిక ఎప్పుడని ఎదురుచూస్తున్నాను.
నీవెప్పుడూ చైతన్యమై,ప్రేరణవై ఉండాలని ఆశిస్తాను.
జీవనదమై,సజీవ నాదమై 
నీవు కలకాలం క్షేమంగుండాలి.
కామెంట్‌లు