పుట్టుట అందరిపని
పుట్టెడు జ్ఞాన సంపదతోభక్తి సామ్రాజ్యాన్ని
పొందిన పుట్టుక పుణ్యాల గని.
తండ్రి జగతికి ఆయువు,వాయువు తల్లి సుగుణాల ప్రోవు
ఇక తనయుడు తక్కువ వాడా? కాడు.
అతడే వాయు పుత్రుడు రామభక్తుడు. విశేష గుణ సమన్వితుడు.
హనుమంతుడు
🙊
రామ అన్న అక్షరాలతో రమ్యమైన గుడి తన
ఎడదలో వెలయ
రత్నాలలో రామరూపం లేదని
రచ్చ చేసిన మర్కటేంద్రుడు.
రామ నామం తన జీవనాధారం.
సీతమ్మ జాడకోసం జలధి లంఘించి,
సింహళ సింహాసనాన్ని ఒక్క ఊపు ఊపిన
బలవంతుడు హనుమంతుడు
🪸
లంకలో రక్కసులకు తన తోక బలం చూపి
వారి బలం చల్లబరచి,సీతమ్మ జాడ రామయ్య
చెవినేసి సంతోష పెట్టిన కార్య సాధకుడు గాలి తనయుడు.
భాస్కరుని బంతి
జేసే,రవిచేత విద్యలన్నీ నేర్చి,
సీతారాముల
మనసు దోచి
ధన్యుడైన వానర వీరుడు పుట్టినాడు ఈనాడు.
జోల పాటలు పాడుతాము, గోల చేయవద్దని బ్ర
తిమాలుదాము.
ఆంజనీసుతునికి వింజామర వీచరే
వాయిసుతుని
కివ్వరే రామనామ క్షీరము.రామభక్తునికి వినిపించరే
త్యాగయ్య, రామదాసయ్యాది
భక్త బృంద రామనామ సంకీర్తనలను.
"బంటు రీతి కొలువివ్వవయ్యరామా"...
"నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి,, ...
పిబరే రామరసం...
హనుమా వినుమా
అనుమా నీ నోటితో🪴🪴🪴

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి