పిన్నిసే ఆధారం: - డా.కందేపి రాణీప్రసాద్
కాల్లో తుమ్మముల్లు దిగినా 
చెవిలో పేరుకున్న గుబిలి తీయాలన్న 
పంటిలో ఇరుకున్న మెతుకులకైన 
పెన్ను పాళిలో సిరా గడ్డ కట్టినా 
పిన్నిసే ఆధారం! పిన్నిసే పెద్ద టూల్

బజార్లో చెప్పు తెగితే రక్షించాలన్న 
జాకెట్ హుక్ తెగిపోతే పెట్టుకోవాలన్న 
పైట జారకుండా పట్టి ఉంచాలన్న 
లాగు టాజయిపోతే వేసుకోవాలన్న 
పిన్నిసే ఆధారం! పిన్నిసే పెద్దటూల్!

గోళ్ళలో మట్టి తీయలన్నా 
దువ్వేనలో పేరిన మట్టి గీకాలన్న 
చొక్కా గుండి ఊడిపోయినా 
జాకెట్టు కుట్లు విప్పాలన్నా 
పిన్నిసే ఆధారం! పిన్నిసే పెద్దటూల్!

మెడలోని పవిత్ర పసుపు తాడులోనూ 
చేతి గాజులకు గుత్తులుగా వేలాడుతూ 
పసుపు కొమ్ముకు కాపు కాస్తూ 
ఆడవాళ్ళ తొలి రక్షణ ఆయుధంగా
పిన్నిసే ఆధారం! పిన్నిసే పెద్ద పరికరం!

కామెంట్‌లు