కళలకుంచే కాపు రాజయ్య చిత్రాలు చిరస్మరణీయం

  అంతర్జాతీయ చిత్రకారులు, కళారత్న, కీర్తిశేషులు డాక్టర్ కాపు రాజయ్య పల్లె చిత్రాలు ఎప్పటికీ జనుల గుండెల్లో జీవిస్తాయని, సిద్దిపేట కవులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహరావు, వరుకోలు లక్ష్మయ్య, కాల్వ రాజయ్య, డబ్బికార్ సురేందర్, నల్ల అశోక్ లు అన్నారు. కాపు రాజయ్య జయంతి సందర్భంగా సిద్దిపేటలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు రాజయ్య గీసిన బతుకమ్మ, బోనాలు, ఎల్లమ్మ, కుల వృత్తుల చిత్రాలు పల్లె మట్టి పరిమళత్వాన్ని దోచేలా ఉన్నాయని, అంతర్జాతీయంగా ఖ్యాతి గరించిన చిత్రకారులు కాపు రాజయ్య చిరస్మరణీయులని, తన చిత్రాలతో సిద్దిపేట తెచ్చారని అన్నారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు