బాలకాండము శ్రీమద్రామాయణము: ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ప్రభాత వేళలో తృణశయ్యపై పవళించియున్న  
రామలక్ష్మణులను 
మహర్షి ఇలా మేలుకొలుపుచుండెను 
కౌసల్యపుత్ర రామా తూర్పు కిరణాలు వచ్చేనయ్య 
మేలుకోండి  రామలక్ష్మణులారా మేల్కొనండయ్య 

స్నాన సంధ్యావందనాల నాచరించండయ్యా
మహర్షి మాటలినిరామలక్ష్మణులు తక్షణమే లేచినారు

వారు స్నానమాచరించి సూర్య వందనము చేసి
ఋషులకు తర్పణములనిచ్చి గాయత్రీ మంత్రము పటించి 
తపోధనుడైన విశ్వామిత్రులకు నమస్కరించినారు 

మిక్కిలి సంతోషముతో వారు బయలుదేరినారు 
గురువుగారి వెంట అడుగులేస్తూ హాయిగా వెడలినారు
ఆ మహావీరులు సరయానదిని చేరినారు 
అచట ఒక ఆశ్రమమును చూసినారు రామలక్ష్మణులు 

ఓ మహాత్మా ఈ పుణ్య ఆశ్రమం ఎవరిదయ్యా 
ఇక్కడ నివసించు ఆ మహాపురుషుడెవరు 
కుతూహలముగా మునీశ్వరుని వారు అడిగినారు 
ఆ అశ్రమము గూర్చి తెలుపెద వినుము రామా 


కామెంట్‌లు