కులమత రహిత సమాజమే తన ధ్యేయమని
దేశ ఆర్ధిక ప్రగతికి విద్య ప్రధానమని
అణగారిన బడుగు బలహీన వర్గాల
సాధికారికత కోసం జీవితాంతం
కృషిచేసిన జ్యోతిరావు పూలే
భారతమాత ముద్దుబిడ్డ.
బాల్యవివాహాలను వ్యతిరేకించి
వితంతు పునర్వివాహాలకు ప్రాధాన్యత నిచ్చి
భార్య సావిత్రి బాయి పూలేతో కలసి
స్త్రీ విద్యకు బాలికల ఉన్నతికి పోరాడిన స్త్రీ జనోద్ధరకుడు
సత్యశోధక సమాజమునుస్థాపించి
సహపంక్తి భోజనాలద్వారా
ప్రజలంతా పరమేశ్వర రూపాలని
దీనబంధు పత్రిక ద్వారా బీదల ,కార్మికుల సమస్యలను
సమాజానికి భార్యతో కలిసి
అవమానాలు ఎదురైన జీవితాంతం పోరాడిన సంఘ సంస్కర్త
భారతరత్న డాక్టర్ అంబేద్కర్ పూలే మహాశయుడే నా జీవితానికి ఆదర్శమని ప్రకటించుకొనుట
ఆ మహనీయుని నిస్వార్థ దేశభక్తికి ప్రతీక
నేటి తరానికి స్ఫూర్తిప్రదాత
నవయుగ వైతాళికుడు జ్యోతిరావు పూలే
మీకివే అందిస్తున్నా నా అక్షరాంజలులు....!
..........................
జ్యోతిరావు పూలే: - కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)విశాఖపట్నం.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి