సామెత -196- ఆడి తప్పరాదు- పలికి బొంకరాదు
****
ఇగ్గో!అవ్వా! గిదేమన్న నాయంగుందా? ఎంతాశ బెట్టిండు.నీకెందుకత్తా! నేనున్న గద.మల్లెవలి తానకి పోమాకు. నేన్జూసుకుంట.సయిమానికి తల్కాయ తాకట్టు బెట్టయిన సరే.నీ దోశిట్ల బోత్త అన్నడు.గిప్పుడేం జెయ్యాల్నో కాల్జేతులాడట్లేదవ్వా!"
గట్లెట్ల నమ్మినవ్ శెల్లె! గానంత లఫంగి ఇంకోడుండా ఈ ఊల్లె. నోరు తెరిత్తే అబద్ధాల కంపు. నాకొక్క మాట శెప్పవైతివి. ఎల్లుండి లగ్గం బెట్ట్కొని. గిప్పుడు నా తానకొచ్చి యిశారిత్తె నేనేం జెయ్యను. ఐదేలో పదేలో ఐతే కింద మీద బడి సద్దేదాన్ని.లచ్చల్ల యవ్వారం. ఎట్ల శెప్పు.
ఇద్దరాలుమొగలం పెద్ద బుజ్జి పెండ్లికి తక్వబడ్డ పైసల యిష్యమే ముచ్చెట బెడుతుంటే గా సయిమంలో వొచ్చిండు. "ఏంది మావాఁ ?బుజ్జికి లగ్గం కుద్రిందంట గద. మస్తు జోర్దార్గా శెయ్యాలె మావఁ. పిలగానోల్లకి మన కాన్ దాన్ ఏంటో తెల్వాలె.ఎక్కడా తగ్గేదెలే. నీకెందుకు అత్తా!పెండ్లి పన్లు సూస్కోడానికి ఆరం ముందే నా సోపతిగాండ్లను పట్టుకొత్త" అన్నడు.గట్లనే పైసలిషయం యిని గాయనెవలో తెల్శిన ఆసామి వుండు. గాయన ఏదన్న తాకట్టు బెట్టంది ఇయ్యడు. పొలం తాకట్టు బెట్టమని సలా ఇచ్చిండు. యిశారించుకునే సయిమం లేక సరే అన్నం అవ్వా!.
"గాని టక్కరి మాటలు ఎంత బాగ నమ్మిన్రు శెల్లే! గాడంత అవారా గాడు ఎవలన్న ఉన్నరా?"
కొన్ని పైసలు తెచ్చి యిచ్చిండు.మిలిగినవి తెత్తననీ పొయ్యిండు ఆరం దాటింది పత్తాలేడవ్వా.
ఆడి తప్పడం గాని లచ్చణం. బొంకడంల గానంత మొనగాడు ఈ నేల మీదనే లేడు శెల్లె!
అయిన గని గిస్మంటి యవ్వారాలకు నల్గురు పెద్దల్ని పిల్వాలె. పెద్దమనుసుల ముందు అన్కుంటే మంచిది. సరేలే శెల్లే! ఆసామి గా రామయ్య అన్ననేనా? నే ఎల్లి మాట్లాడ్త నువ్వేం రంది జేయకు శెల్లే."
"అగ్గో మాటల్లనే వొచ్చిండు రామయ్యన్న. అన్నా అత్తా! మావా అని ఎంత మోసం జేశిండో తెల్సా! గింతకని నీ తాన మాట్లాడి కొన్ని పైసలు తెచ్చిచ్చిండు. మిలిగినయి ఇంకా తేకుండ పరారైండన్నా? ఏం జెయ్యాల్నో తెల్వక తల్కాయ బట్టుకున్నం."
"అయ్యో గంత పనైందా శెల్లే. గా లెక్క ఆటెంక సూస్కుందం గని గిప్పుడు నీ అవుసరం ఎల్లదీత్త తీ. నా మాట నమ్ము "ఆడి తప్పడం - పలికి బొంకడం "నా ఇంటా వంటా లేదు. నన్ను నమ్ము. ఇప్పుడే వత్త "
అన్కుంట బొయిన రామయ్య గంటల్ల పైకం బట్కొని వొచ్చిండు.
అగ్గో సూశినవా శెల్లె. "ఆడి తప్పరాదు - పలికి బొంకరాదు" అంటే గిదే శెల్లె. రామయ్యన్న ఎంత నియతి గల్లోడో తెల్శింది గద.బత్కితే గట్ల బతకాలే శెల్లే!
గదండీ సంగతి! ఆడి తప్పరాదు -పలికి బొంకరాదు అంటే గిదే మరి.ఆడిన మాట తప్పనని గురువు శుక్రాచార్యుడుతో బలి శెప్పి వామన సామికి మూడడుగుల నేలనిచ్చి పున్నెం కూడ గట్టుకున్నడు.గందుకే గిప్పటికీ గాయన్ని యాజ్జేసుకుంటున్నం.
"అవునా అవ్వా! గీ లగ్గం ఆగకుండ రామయ్య అన్న సుత గిట్ల తెచ్చిండు.ఇంత మంచోన్ని జల్మల మరుత్తమా!.
గదండీ సంగతి " ఆడి తప్పరాదు - పలికి బొంకరాదు" అంటే గిదే మరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి