మేడే దినోత్సవం సందర్భంగా కవితా పోటీలు – విజేతలకు బిరుదులు, అవార్డులు
ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ మరియు ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మేనేజింగ్ డైరెక్టర్ డా. యు.వి. రత్నం, ప్రముఖ రచయిత్రి మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో మేడే దినోత్సవం సందర్భంగా కవితా పోటీలు ఘనంగా కవులకు నిర్వహించబడ్డాయి.
ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 కి పైగా కవులు పాల్గొని తమ కవితలను సమర్పించారు. పాల్గొన్న ప్రతి కవికి ప్రశంసాపత్రాలు అందజేయడంతో పాటు “శ్రామిక మిత్ర” బిరుదును ప్రదానం చేయడం జరిగింది.
ఈ పోటీలలో
ప్రథమ స్థానం – శ్రీ ఈమని వెంకట మల్లికార్జున రావు,
ద్వితీయ స్థానం – శ్రీ నిమ్మగడ్డ కృష్ణ,
తృతీయ స్థానం – శ్రీమతి డా. సరికొండ రమాదేవి గారు సాధించారు.
మొదటి మూడు స్థానాలు పొందిన విజేతలకు ఈ నెల 30వ తేదీన గుంటూరులో నిర్వహించబడే కార్యక్రమంలో “సాహిత్య శ్రామిక స్ఫూర్తి అవార్డు”లను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు డా. ధనాశి ఉషారాణి మరియు డా. యు. వి రత్నo తెలియజేశారు
ఈ సందర్భంగా మేడే దినోత్సవ కవితా పోటీని సమర్థవంతంగా నిర్వహించిన శ్రీ నిమ్మగడ్డ కృష్ణ గారిని పలువురు ప్రముఖులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.మేడే దినోత్సవం శుభాకాంక్షలుతో తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ సేవా ఫౌండేషన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి