మనసు లోగిలిలో మదిని కవ్వించే పరిమళం పుస్తకము ఐతేనే
సమస్త జగతిని కవ్వించే వెన్నెలలోగిలిగా నిలిచేది
భావి జగతికి బంగారు లోగిలి పుస్తకము
కమ్మని కవిత్వాన్ని అలా మనసు పలకపై ముద్రిస్తేనే
చక్కని కవిత్వాన్ని సజీవ సాక్ష్యంలా నిలిపేది
భావి జగతికి బంగారు భవిష్యత్తు నిచ్చేది పుస్తకము
అలసిపోయిన మనసుకు కవిత్వం ఓ లేహనములా నిలిస్తేనే
భావి జగతికి బంగారు పెన్నిదిని ఇచ్చేది కవిత్వం
మదిని ముస్తాబు చేసే మధురానుభూతి పుస్తకము
తెలుగు జాతి ఛందస్సును గుండెలోతుల్లో దాచుకుంటెనే
నిలువెత్తు చరిత్రను సజీవ సాక్ష్యంలా నిలిపేది
కమ్మని భవిష్యత్తును ప్రసాదించే అభయహస్తము పుస్తకము
కోటి వెలుగుల భవిష్యత్తును ప్రసాదించే భవిష్యత్తులా నిలిస్తేనే
కమ్మని కళలకు సజీవ సాక్ష్యంలా నిలిచేది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి