పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. విజయనగరం జిల్లా అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మి నేతృత్వంలో రూపొందిన ఈ ఉత్తరాంధ్ర మహిళా సదస్సులో తిరుమలరావు పాల్గొని సన్మానం పొందారు. కవి సమ్మేళనంలో పాల్గొనిన మహిళలకు కీర్తి పురస్కారాలు, బాలికలకు ప్రోత్సాహక బహుమతులతో సత్కరించిన అనంతరం కవులకు కూడా సౌజన్యమూర్తులుగా కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. తిరుమలరావును శాలువా, జ్ఞాపిక, గ్రంథాలు, ప్రశంసాపత్రాలతో నరసం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు చివుకుల శ్రీలక్ష్మి, సహాయ కార్యదర్శి దాసరి పద్మ, శ్రీకాకుళం యువ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి పొట్నూరు మాలతి, ఆర్.వి.రత్నం, ఎన్.సంథ్యారాణిలతో పాటు, నరసం గౌరవ సలహాదారులు డా.నూనె అంకమ్మరావు, బొబ్బిలి రచనా సమాఖ్య అధ్యక్షులు మింది విజయమోహనరావు, తిరుపతిరావులు ఘనంగా సన్మానించారు. తిరుమలరావుతో పాటు పాతిక మందికి పైగా సౌజన్యమూర్తులకు సన్మానించి గౌరవించడం విశేషం. తిరుమలరావుకు జరిగిన సన్మానం పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
నరసం ఆధ్వర్యంలో తిరుమలరావుకు సత్కారం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి