ప్రాస మంజరి: - ప్రాసమంజరి రూపకర్త -డా. ధనాశి ఉషారాణి -ప్రముఖ రచయిత్రి -తిరుపతి జిల్లా భాకరాపీట
 మాతృభాషలోన చరిస్తూ జీవించు
మాతృభాషమనుగడకై మహి ని యత్నించు
మాతృభాష గౌరవ సౌష్టవాన్ని రక్షించు
మాతృభాష మనుగడకై ఉనికి కై శ్రమించు


భాషనుకాపాడి మాధు ర్యాన్ని రక్షించు
అందరినీ తెలుగు లోనే మాట్లా డించు
తెలుగు నేజీవింపజేయు అందువసించు
మాతృభాష మనుగడకై శ్రమించియత్నించు


భాషా మాధుర్యాన్ని భువిన పంచిపెంచు
భాషాసౌందర్యాన్నిలలోపంచిపెంచు
పద్యసాహిత్యాన్ని జగతిని పెంచిపం చు
తెలుగు భాషాభివృద్ధికెప్పుడు యోచించు

కామెంట్‌లు