ఈ ప్రశా0త గుంబన సం ద్ర0 తన ఆనందపు అలలతో ఎన్ని అందాలు చిందు తోంది...!
ఎంత చక్కని సహజత్వపు వివిధ వన్నెల సౌందర్యం తనది!!
తనలో ఎన్ని అగ్ని పర్వ తా లున్నా తిమింగలాలున్నా...
వివిధ జాతుల జల చరాలకు తాను ఆవాసమై
వివిధ ప్రా0తాలకు మార్గమై...
ఖనిజ సంపదలకు నిలయమై...
మానవ జాతికి మహోప కారివి యైన ఓ సాగరమా
నీ కింత కాటిన్యమెలా వ చ్చింది....!?
సునామీవై విరుచుకుపడు తుంటావ్
ఎంతో ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తావ్ !
భయంకర మైన నీ ఘోష,
ఉవ్వె త్తున లేపే నీ అలలు మమ్ముల భయ భ్రా0తుల కు గురి చేస్తాయ్....!
నీలోని అగ్ని పర్వ తాలు బ్ర ద్ద లై... సునామీలు రావ టానికి కారణం మా మనుషులే కదా...!
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని ఊరకనే అన్నారా..!!
ఏది యేమైనా... నీవు పరోప కారివే...
నిన్ను నిందించటం పాపమే...!
ఓ సాగరమా...!
వికృత రూపాన్ని చూ పక... అందాల ప్రక్రుతివై కల కాలం మాకుఅండగా నిలిచి, ఆనందాన్ని పంచుమా..!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి