జీవించడం వేరు,
చదవడం వేరు కాదు.
నేను పుస్తకాల వాసనల మధ్య పెరిగాను. అది మా నాన్నగారి వాసన కూడా.
ఆయన విప్లవ కవి భారతీదాసన్ గారి కవిత్వ బృందానికి చెందిన కవి. అందుకే నాకు భారతి అని పేరు పెట్టారు. ఇది నా అసలు పేరు; మారుపేరు కాదు.
నా చిన్నతనంలో, ఆయన నన్ను 'రారా' అని పిలిచి తీసుకువెళ్ళే దారులు కలిసే చోటు తీసుకువెళ్ళేవారు ముద్రణాలయం, ప్రచురణ సంస్థ, గ్రంథాలయం, పాత పుస్తకాల దుకాణం, కవి లేదా రచయిత ఇల్లు - ఇలాంటివే.
ఆయన ఒక పుస్తకం కొంటే, నాకు కూడా ఒక పుస్తకం కొనిచ్చేవారు. పంచతంత్ర కథలు, ఈసప్ నీతి కథలు, తెనాలిరామ కథలు, ముల్లా కథలు - ఇవన్నీ చెప్పి పుస్తకాలు కొనిచ్చేవారు.
ఆ తర్వాత, నేను అనిల్, వాండుమామా, అంబులిమామ అనే పత్రికలను కొని చదివాను. ఆ రోజుల్లో, మా నాన్న నాకు రెండు పత్రికలు కొని చదివించేవారు. వాటిలో ఒకటి మంజరి. అది కళలకు సంబంధించిన ఒక విజ్ఞాన సర్వస్వంలా ఉండేది.
అది నా దృష్టిని ఆకర్షించిన ఒక పత్రిక. మరొకటి 'కళైక్కదిర్'. అదొక అరుదైన, సరళమైన విజ్ఞాన శాస్త్ర పత్రిక. 'యునెస్కో కొరియర్', 'కుమరి మలర్' పత్రికలు పోస్టు ద్వారా వస్తూ ఉండేవి. ఈనాడు, ఈ పత్రికలు లేకపోవడం ఒక ప్రత్యేక నష్టమే కాదు, అది తమిళ భాషకే తీరని లోటు.
ఒకరోజు, మా నాన్నగారి వేలు పట్టుకుని నడుస్తూ, కవిత్వం అంటే ఏమిటని ఆయన్ని అడిగాను.
ఆయన ఏమీ చెప్పలేదు. ఆ సమయంలో, నన్ను చూడగానే ఆయన ముఖం గొప్ప ఆనందంతో కవితాత్మకంగా మారిపోయింది. మేము ఇంటికి వచ్చాక, ఆయన భారతియార్, భారతీ దాసన్‌ల కవితల పుస్తకాలు బయటకు తీసిచ్చి నన్ను చదవమన్నారు. ఆ పఠనాల పరంపర నన్ను ఎన్నో ఉన్నత శిఖరాలకు, ఎన్నో దృశ్యాలను పరిచయం చేసింది.
నా పాఠశాల చివరి సంవత్సరాలలో, నా పన్నెండవ తరగతి తమిళ ఉపాధ్యాయుడు టి. సలావుద్దీన్ గారు నా దృష్టిని రష్యన్ సాహిత్యం వైపు మళ్లించారు. ఆయన సోవియట్ సాంస్కృతిక కేంద్రంలోని పుష్కిన్ సాహిత్య మండలికి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన నన్ను తన డిప్యూటీ సెక్రటరీగా నియమించి ప్రోత్సహించారు. ఆయన ఇంగ్లీషు నుండి తమిళంలోకి అనువదించి, టాల్‌స్టాయ్, పుష్కిన్, దోస్తోయెవ్‌స్కీ, ఆంటోన్ చెకోవ్, మాయకోవ్‌స్కీ, మాగ్జిమ్ గోర్కీ, తదితర ప్రముఖ రష్యన్ రచయితల సాహిత్యాన్ని నాకు పరిచయం చేశారు.
తాయ్ అనే వార్తాపత్రికలో నాకు ఉద్యోగం ఇచ్చి, ఎంతో ప్రేమతో చదివిస్తూ వివిధ అంశాలను నేర్పింది వలంపురి జాన్ గారే.
వారిందరికీ నేను చదవడం ద్వారా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది.
చదవడం జీవిత ద్వారాలను తెరుస్తుంది.
అది మన ప్రయాణంలో చేయి పట్టుకుని తీసుకువెళుతుంది.
ఆకాశంలో మనకు తోడుగా ఉండే చంద్రుడిలా, భూమిపై మనకు తోడుగా ఉండే సహచరుడు పుస్తకం.
సంతోషాన్ని పండుగలా జరుపుకోవడానికి నాకు ఒక పుస్తకం కావాలి.
దుఃఖం నుండి కోలుకోవడానికి నాకు ఒక పుస్తకం కావాలి.
ఈ మధ్య మనమందరం జరుపుకున్న ప్రపంచ పుస్తకదినోత్సవం పురస్కరించుకుని నాకిష్టమైన తమిళ కవి పళనిభారతి రాసిన మాటలివి. నేనిది ఆలస్యంగా చూడటంతోనే అనువదించేశానిలా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి