మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి.

🌹నగరాల వెలుగుల్లో నీడలు పెరుగుతుంటే
గ్రామాల నిశ్శబ్దంలో బాధలు మోగుతుంటే
ఎందుకోసం సంబరాలు... 
ఎవరికోసం ఈ సంబరాలు..!

🌹మనుషుల మధ్య గోడలు ఎత్తుగా పెరిగిన వేళ
మానవత్వం పుటల్లో మౌనం చేరిన వేళ...
ఎందుకోసం సంబరాలు... 
ఎవరికోసం ఈ సంబరాలు..!

🌹మద్యము మత్తుకి బానిసై కుటుంబ-
సభ్యులను రోడ్డుపైన పడేస్తున్న వేళ...
ఎండిన డొక్కలతో అన్నం కోసం ఎదురుచూసే నిరీక్షణ కళ్లలో కారం పొడి చల్లిన వేళ...
ఎందుకోసం సంబరాలు... 
ఎవరికోసం ఈ సంబరాలు..!

🌹ఉద్యోగ అవకాశం కోసం తలుపులు తట్టే ఆశల్లో
మన్ను కొట్టిన వేళ...
పేదల బాధలు రుధిర గీతాలై పాడిన వేళ...
ఎందుకోసం సంబరాలు... 
ఎవరికోసం ఈ సంబరాలు..!

🌹ప్రకృతి కన్నీటి చుక్కలు నా సాహిత్య చేతి ద్వారా
సమాజ భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వేళ...
నింకను పసిమొగ్గల నుండి ముసలి ముతక వరకు
అత్యాచారాలు చేస్తూ, దాడులు చేస్తున్న వేళ...
ఎందుకోసం సంబరాలు... 
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఒక్కసారి ఆలోచించండి...
ఒక్కసారి రేపటి ప్రపంచం కోసం ఆలోచించండి...
===========================================
మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218

కామెంట్‌లు