ఏవీ ఆ ..ఆటలు,....?
కాళ్ళా గజ్జా - కంకాలమ్మా,
వేగూ చుక్కా - వెలగా పండు!
గుడు గుడు కుంచం - గుండే రాగం!
దూదూ పుల్లా- దుక్కుడు పుల్లా,
మా తాత పందెం పుల్ల!
దాగుడు మూతా - దండాకోర్
వీరి వీరి గుమ్మడి పండు -
వీరి పేరు ఏమి?
పచ్చాకు,పైరాకు -
రెండు బిందెల బీర ఆకు
చెమ్మ చెక్క - చేర దేసి మొగ్గ!
నేల బండ - కోతి,కొమ్మచ్చి
డబ్బుకు రెండు ద్రాక్ష పళ్ళు!
ఈ ఆటలకు ఎప్పుడో కాలం చెల్లు!!
రాత్రీ పగలు టీవీలు ఘల్లు.,..
చేతుల నిండా సెల్ పోన్లు ఫుల్లు!!!
***
అదృశ్యక్రీడలు...!!: - యెనుముల వేణుగోపాలరావు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి