భరోసా...!!: - యెనుముల వేణుగోపాలరావు - అమలాపురం

 నాన్న అనే రెండు అక్షరాల పదం,
నిన్ను నన్నుముందుకు నడిపించే తోవ!
స్వార్ధమెరుగని వ్యక్తిత్వం నాన్నది
ఇది జనమెరిగిన యధార్ధం!
అమ్మ కడుపులో మోస్తుంది,
నాన్న భుజాలపై మోస్తాడు !
అమ్మ అన్నం పెడుతుంది ,
నాన్న తన జీవితాన్నే
ఫణం గా పెడతాడు!
అమ్మ ఆనందం భహిర్గతం,
నాన్న ఆనందం అంతర్గతం!
నాన్నతన ఆకలి చూసుకోడు,
మన ఆకలి తీర్చేడానికే _
అహర్నిశలు శ్రమిస్తాడు!
ఆయన చిందించే చెమట బొట్టు,
మన అభివృద్ధికి ఒక్కో మెట్టు!
అమ్మ అంటే అభయం,
నాన్న అంటే భయం!
అమ్మ మనసు కమ్మధనం,
నాన్న మనసు గుంభనం!
అసలు_
నాన్న అంటే నే,
ఒక భరోసా,....!!
        ***

కామెంట్‌లు