సాంబారు ఇడ్లి కి సాటెవ్వరు: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
ఇంటిల్లిబాదికి
ఇష్టమైన అల్పాహారం
ఇంటి ఇల్లాలు గాజుల చేతితో  వడ్డిస్తు
  అలా తింటే ఎలా అని
కరివేపాకు పొడి, చట్నీ
వేడి వేడి సాంబారు తో
తింటే 
అమృతం దిగదుడుపే అని
అరచేతి అంత 
ఆరు ఇడ్లిలు
ఆరవై ఏండ్లయి తిని
ఆరోజుల్లో ఆఫీస్ కెళ్ళి
కళ్ళు మూతలు పడిన రోజులు 
మరువలేనిది.
డెబ్బది సంవత్సరాలు దాటినా
వయస్సుతో పని ఏముంది అని
అనుష్టానం అయినవెంటనే లాగించి
ఇంటి ఇల్లాలు ఇచ్చిన
చక్కని చిక్కని కాఫీ ఆస్వాదిస్తుంటే
అమెజాన్ లో పనిచేస్తున్న
ఇరవై ఐదేండ్ల మనుమడు
అరవింద్ ఆసియాలోనే
అత్యంత పోషక ఆహారం ఇడ్లీ అని
నాతో బాటు వాడు కూర్చుని
నీ ఆరోగ్య రహస్యం తెలిసింది తాతయ్య అని
నానమ్మ చేసిన వేడి వేడి సాంబారు ఇడ్లియే అని అంటే
ఏమనుకున్నారన్నట్లు 
అరవై ఏండ్లయి నాతో కాపురం చేసిన
ధర్మపత్ని నా వైపు చూసిన చూపు మరువలేను....!!
===========================================

( మార్చి 30 ప్రపంచ ఇడ్లి దినోత్సవం సంధర్భంగా వ్రాసినది)
............................

కామెంట్‌లు