మే డే శుభాకాంక్షలు...మంజుల పత్తిపాటి
పిడికిలి బిగించి ఎదిగే ప్రతి క్షణం
శ్రమకు జెండా ఎగరే ప్రతి వేళ..
మంజుల పత్తిపాటి హృదయం పలుకుతోంది
కార్మికుడే నిజమైన వీరుడు అని..!

కడుపు నింపే అన్నం వెనుక దాగిన కష్టాలను 
ప్రతి ఇంటి నిర్మాణం వెనుక ఉన్న వారి
శ్రమ గాథలను పదాలుగా మలిచే
మంజుల పత్తిపాటి కలం చెబుతోంది..
కార్మికుడే సూర్యుడు ఈ భూమికి అని..!

వారి చెమట చుక్క పడిన నేలపై
మన జీవితం మొలకెత్తింది అని గుర్తుంచుకో..!

వారి అలసిన చేతులు ఆగిన క్షణంలో
ప్రపంచం నిలిచిపోతుంది అని గుర్తుంచుకో..!

కష్టజీవి ముఖంలో నవ్వు చూడాలని
పదాలను దీపాలుగా వెలిగిస్తూ...
వారి జీవితాల్లో దీపావళి కాంతులు చూడాలని
మంజుల కలం కన్నీరు కార్చింది..!

కాలికుండతో అన్నం వండే మంటల్లో..
వారి కడుపు ఖాళీగా ఉన్న రాత్రుల్లో..
వారి పేగుల చప్పుడు వినిపించిన ప్రతిసారి
మంజుల కలం కన్నీరు కార్చింది..!

ఆమె చెమటతోనే నిలుస్తుంది సమాజం
ఆమె శక్తితోనే ముందుకు సాగుతుంది ప్రపంచం
కానీ.... ఏమీ ఆశించక 
కుటుంబం నవ్వులే తనకు పండుగ అని
భావించే నిజమైన శ్రామికురాలు మహిళా..!

పొయ్యి వెలిగించే ప్రతి మంటలో
తన కన్నీళ్లను గుండెల్లో దాచుకుని
తన కలలు గిన్నెల్లో మరిగిపోతున్నా కూడా...
చిరునవ్వు మాత్రం తగ్గని నిజమైన
శ్రామికురాలు మహిళా..!

చెమట చుక్కలతో స్వప్నాలు నిర్మించే శ్రామికులకు
వందనాలు తెలియజేస్తూ  అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు✊.
===================================
శ్రామికురాలు
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.

కామెంట్‌లు