జంతు ప్రపంచం: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 బాలల కిష్టం జంతువు చలనం
గంతులు వేస్తూ ఉరకలు ఖాయం
సరదా సెలవుల సాయం కాలం         
పిన్నల పెద్దల వాంఛిత నటనం

బోనుల నిలచిన‌ అనేక రకాలు
కనులకు విందుగ కలిగే రవాలు
పిల్లల కోసం పరచిన పదాలు


మనసుల గెల్చును సర్కసు సవాళ్ళు

గుంపుల మధ్యన సందడి చేయగ
ఇంపుగ నచ్చిన తిండిని తినగా
పెంపుడు కూనల మోదమ లరగా
ముంపులు లేవని చెప్పగ కనుమా
కామెంట్‌లు