అమలాపురం లో
అమ్మమ్మ గారింట్లో
అరవై ఏండ్ల క్రిందట
అమ్మతో కలసి వెళితే
అమృత గుళికలు తీసుకుందామని
ఆనందం మామయ్య
అరెకరాల పొలం దగ్గరకెళ్ళి
అప్పారావు గాడితో
తాటి చెట్టెక్కించి
తాటికాయలు నుంచి
లేలేత ముంజెలు తీయించి
అక్కడే మేమిద్దరం లాగించి
మిగతా గెలలతో
అమ్మమ్మ ఇంటికెళ్ళి
ముంజెలు, తాటిముంజెలు
వడ దెబ్బ తగలదని
అరవింద్ బావ ఐరన్,ఫాస్ఫరస్, పీచు పదార్థం
పోషకాలు ఉంటాయని అని
నాలుగిళ్ళ లోగిలిలో
మొత్తం పదిమంది పిల్లలం తినడం
తరువాత మీసాలతాతయ్య అమ్మమ్మ కూడా తినడం
ఇప్పటికి మధుర జ్ఞాపకమే
మరి నేడో తాటి చెట్లు లేక
సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటు
పది అంతస్థుల భవనంలో
ముంబై మహానగరంలో
ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి రంగుల రస్నా మనుమలతో కలసి త్రాగుతు కాలం గడుపుతు జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాను
..........................
వేసవి తాపపు అమృత గుళికలు: - కవి మిత్ర, సాహిత్య రత్న-\ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)విశాఖపట్నం
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి