-- జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పత్రం అందజేత
--పిల్లల విద్యా ప్రమాణాల పెంపు ఆధారంగా అవార్డుకు ఎంపిక
రెండోసారి జిల్లా ఛాంపియన్ స్కూల్ అవార్డు అందుకున్న హెచ్ఎం ఈర్ల సమ్మయ్య
పెద్దపల్లి జిల్లాస్థాయిలో ఎఫ్ఎల్ఎన్( ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసి) కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో అత్యధిక విద్యా ప్రమాణాలను పెంపొందించి ఉత్తమ ఫలితాలు సాధించిన ఊషన్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లాస్థాయి ఛాంపియన్ అవార్డు అందుకుంది. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్లో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ జిల్లాస్థాయి రివ్యూ, అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య జిల్లా కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష , జిల్లా విద్యాశాఖ అధికారిణి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ చేతుల మీదుగా 'జిల్లా ఛాంపియన్ స్కూల్ అవార్డు' అందుకున్నారు. వీరు జిల్లా చాంపియన్ స్కూల్ అవార్డు అందుకోవడం ఇది రెండవసారి. 2024-25 లో ఒకసారి, 2025-26 విద్యా సంవత్సరంలో రెండోసారి. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఈ అవార్డు రావడం పట్ల శ్రీరాంపూర్ తహసిల్దార్ రాముడు, ఎంపీడీవో రామ్మోహన్, ఎంఈఓ మహేష్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతిరఘు, ఉప సర్పంచ్ మేడి అశోక్, వార్డు సభ్యులు ఆవుల సునీత, ముష్కే కుమారస్వామి, కూసలత, ముసుకు అంజయ్య, చంచల వనిత, ముస్కె స్రవంతి, చైర్ పర్సన్ పెండ్లి స్వరూప, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తన సహచరులతో కలిసి పాఠశాల పిల్లల్లో ఉన్న అంతర్గత శక్తులను వెలికి తీసి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. పాఠశాల సమయం తర్వాత కూడా రెండు గంటల పాటు అదనపు తరగతులను నిర్వహిస్తూ పిల్లల్ని అద్భుతంగా తయారుచేస్తున్నారు. పిల్లలకు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. పిల్లల కోసం అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి