ఐకమత్యం!: - అచ్యుతునిరాజ్యశ్రీ
శక్తి యుక్తితో ఐక్యమత్యమే బలం
ఈర్ష్య అసూయ ద్వేషం అవహేళనలతో  సమాజం దేశం
ఛిన్నాభిన్నం

పుట్టలోన బైట చిట్టిచీమల ఐక్యత,బాధ్యత బరువుతో పరస్పర సహకారం
తేనెటీగలు రెక్కలల్లారుస్తూ దిశానిర్దేశం,మకరందంకై వెతుకులాట

ఆటపాటల్లో అంతా ఒక్కటే
అనే నినాదంతో పోరుబాట
గెలవాలి,గెల్చితీరాలి, మాతృభూమి కై పోరాడాలని 
ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు
నేడు మన క్రికెట్ హాకీ వీరులపోరాటాలు

 పోరాటంకి సైసై అన్న యువత 
సాధించాడు ఘనత

భారతీయులకు అండగా బెంజ్ కార్లలో తరలింపులో సంఘటిత శక్తి,గడ్డిపోచలన్నీ కల్సి
కట్టించాలి మదపుటేనుగు పిచ్చిని
కానీ ఐకమత్యంలోపించి మూడో ప్రపంచ యుద్ధానికి బీజం

కాకులలో ఉన్న సమైక్యత
మనకేది?
అంతటా ,ముక్కు మూతి విరుపులు
మాటలతూటాలు,పదాలపేలుడుపదార్ధాలు పేలుస్తూ సమూహాల్లో
మిగిలే ఏకాకులు

కుటుంబానికి రక్ష సంఘటిత శక్తి
బాల్యం నుంచే అలవర్చాలి మనం మనది అనే భావం
బడిలో గుడిలో భావైక్యతతో పాటు ,ఇంటిగుట్టు రచ్చకెక్కనీక 
సాధించాలి లక్ష్యం,చేయరాదు నిర్లక్ష్యం

 ...స్వస్తి...

కామెంట్‌లు