విద్య బుద్ధులు నేర్చిన రాముడు
ఎంతో వినయసీలుడు ప్రథమ పుత్రుడు
అన్న సేవలో అతి బుద్ధిమంతుడు లక్ష్మణుడు
ఎంతో సహనవంతులు భరత శత్రుజ్ఞులు
సదా వేళలో తనయులు తండ్రికి
తోడునీడగా నిలచియుండిరచట
యుక్త వయసు వారికొచ్చేనని
వారి వివాహ మహోత్సవం గూర్చి
దశరథుడు యోచన చేసెను మంత్రులతో
అట్టి సమయమందు అచటికొచ్చినాడు
విశ్వామిత్ర మహర్షి
దశరథరాజును దర్శించ కోరినాడు
దశరథ రాజు మహార్షికి ఎదురెళ్లి నాడు
బ్రహ్మ తేజస్సుతో వెలుగుచున్న విశ్వామిత్రుని
దశరథుడు కనుల చూసి సంతోషించి
స్వాగతం పలుకుతూ కోటలోకి తీసుకెళ్లినాడు
దశరథా దేశ ప్రజలంతా కుశలమే గదా
దశరథుడు ప్రజల క్షేమము గూర్చి తెలిపినాడు
ఓ మహార్షి మీరు ఇచటికి వచ్చిన అభీష్టమేమిటి స్వామి
దశరథుని మృదువచనములు విని
ఆ మహర్షి పరమానందబరితుడైనాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి