బంగరు సీమ....!!-యెనుముల వేణుగోపాలరావు - అమలాపురం.

 ఆకు పచ్చని కంబలి కప్పినట్టు 
పచ్చదనంతోనిండి ఉంటుంది 
మా...కోనసీమ
ఇక్కడ అనురాగాలు, 
ఆప్యాయతలు మెండు !
కల్మషాలు అన్నవి _
అసలే లేకుండు!
సంస్కారం మా పుట్టిల్లు,
సంస్కృతి మా మెట్టినిల్లు !!
ఇక్కడ_
ఎటుచూసిన కొబ్బరి చెట్లు 
పంటపొలాలపచ్చధనం,
మా ప్రేమ పలకరింపుల తీయదనం!
ఇక్కడ సంక్రాంతికి జరిగే 
కోడిపందాలు_ఎడ్లు పందాలు,
చూసే వారి ఆనందానికి 
ఉండవు అసలు పట్టపగ్గాలు !
ఎగరేసే రంగుల గాలిపటాలు,
చుట్టూ ఆకుపచ్చనిపొలాల్లో 
పనిచేసేవారి మనసు _
గాలిలో తేలు !
గన్నవరం ఆక్విడెట్టు,
రైతు సోదరులకు ఆయువు పట్టు ?
నగరం అనే గ్రామంలో దొరికే కాస్తాలు ,
నానిరొట్టెలు,
గరాజీలు(పిచ్చుకగుళ్ళు).
వాటి రుచి....
అబ్బా వర్ణించతరమా ? 
ఏమి ఆ రుచులు !
ఒకపక్క గోదావరి,
మరో పక్క సముద్రం,
ఇంకో పక్క పంట కాలువలు, 
పిల్ల కాలువలు , చేపల చెరువులు ,
చుట్టూ నీరు - మద్యలో సీమ
అదే అదే మాకోన సీమ - 
మనందరి బంగారు సీమ!!
                 ***

కామెంట్‌లు