విశ్వామిత్రుడు దివ్యాస్త్రముల నొసుగుట: - ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
విశ్వామిత్రుడు రాముని తో ఇలా పలుకుచుండెను 
ఓ రామా తాటకిని ఒక్క వేటున వధించినందుకు 
నేను మిక్కిలి సంతుష్టుడనైతిని 
నీకు దివ్య అస్త్రములను నేను ఇస్తాను రామా 

యుద్ధమున నీ దాటికి ఎవరు నిలువ లేరు 
కడకు దేవతలు అసురులు గంధర్వులు కూడా 
ఈ అస్త్రములచే నీకు వశమగుదురు
ఆ అస్త్రముల పేర్లు చెప్పేద వినుము రామా 

దివ్యమైన దండ చక్రం, కాలచక్రం 
విష్ణు చక్రం ఇంద్రస్త్రమును నీకు వసంగెదనయ్య
వజ్రాస్త్రము మహాశూలం బ్రహ్మాస్త్రము 
ముఖ్యమైన అస్త్రములన్ని నీకు ఇచ్చెద రామా 

ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్ర్తం నీకు ఇచ్చేది శ్రీరామ 
విష్ణుశక్తి శివశక్తి అను శక్తి ద్వయమును నీ కోసంగెదను

రాక్షసుడు ధరించినట్టీ కంకాలములను
కాపాలము, నీకిచ్చేద
ఓ రామ విద్యాదారులు ప్రయోగించినట్టి
వందన హస్త్రమును 
ఖడ్గరాజమును  సౌర అస్త్రమును నీకిచ్చేదెను 


కామెంట్‌లు