ప్రభాత సమయాన
దంత దావనం చేసుకున్న వెంటనే
నవ్వు ముఖంతో నా జీవిత భాగస్వామి ఇచ్చే కాఫీ
అమృతం కన్నా అతి మధురం.
తాతయ్య బాగున్నారా అని చిరుమంద హాసంతో
పలకరించే మనుమలు
మాధవుడి కూతురు మాలతి పెండ్లిలో
ఏడు పదుల వయస్సు ఓ లెక్కా అని
రండి తాత మీరే నా హీరో అంటు తనతో స్టెప్పులు వేయించిన మనుమలు
వారి నవ్వుల మధ్య ఏడేండ్ల పిల్లాడిగా మారి
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదని పాటకు
మా ఇంటావిడతో కలసి వేసిన స్టెప్ లు ముందు
అక్కినేని ,వాణిశ్రీ బలాదూర్ అన్న మనుమలతో
నవ్వుతూ లోపల ఆనందంగా ఉన్నా సిగ్గుతో
ఏంటిరా అన్న మా ఆవిడతో
పక పక నవ్వుతూ ప్రదీప్, ప్రమీలలు
ఆ నాటి వాణిశ్రీ నీముందో లెక్కా అన్నారు.
నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వలేక పోవడం ఒక రోగం అన్నాడు జంధ్యాల
నవ్వు నాలుగు విధాలు చేటన్నారు ఆనాడు
నేడు నవ్వు నలభై విధాల మేలు అన్నారు శాస్త్ర పరిశోధకులు.
పాపాయి నవ్వులు
పండు ముదుసలి బోసి నవ్వులు
ప్రేయసి ప్రియుల సంభాషణల మధ్య ముసి ముసి నవ్వులు
వృద్ధ దంపతులు నాటి జ్ఞాపకాలను తలచుకుని
పిల్లల, మనుమలతో నవ్వులతో చెప్పే సంఘటన లు
ఎన్నని, ఏమని నవ్వుండి, నవ్వించండి
నలుగురితో కలసి బ్రతికి ఉన్న
నాలుగు రోజులు ఆరోగ్యంగా ఉండండి.
"నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు" అని
ఆరోగ్యంగా పరమాత్ముడిచ్చిన
జీవితాన్ని శతమానం భవతి గా గడుపుదాం..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి