జల సంరక్షణ అందరి బాధ్యత

 తొట్టంబేడుమండలం లోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో విద్యాశాఖ నిర్వహిస్తున్న జల పక్వాడ కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు ,ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారం తో నీటి సంరక్షణ పోస్టర్ ని తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు నీటి పొదుపు మరియు చెట్లు నాటడం
పై అవగాహన కల్గించాలని, వర్షపునీరు భూగర్భ జలాలుగామారడంలో ఇంకుడు గుంతలు ప్రాముఖ్యతను వివరించాలని , వృధా నీటిని అరికట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులు  తాము తయారు చేసిన జల సంరక్షణ పోస్టర్ తో గ్రామంలో నీటిని సంరక్షించండి,చెట్లను కాపాడండి అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
కామెంట్‌లు