ఆది శంకరులు సాక్షాత్తు పరమేశ్వరులే: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
సమాజం  అధర్మభూయిష్టంగా ఉన్న స్థితిలో
ధర్మపరిరక్షణార్ధం దివి నుంచి భువికి ఏతెంచి
ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి
సనాతనధర్మ ఔన్నత్యాన్ని చాటిన ఆది శంకరులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులే.

దైవం కన్న జన్మకు కారణమైన మాతృమూర్తి మిన్నయని
ఆమె ఆశీస్సులతో సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి
సమాజన మూఢనమ్మకాలకు వ్యతిరేకించి
పరదేవతా స్వరూపమైన తల్లి దహన సంస్కారాలు చేసిన మహనీయులు
ఎంతకాలం బ్రతికేమన్నది గాక
జీవించినంతకాలం ధర్మయుతంగా ఉన్నామన్నదానికి
శంకరాచార్య వ్రాసిన గ్రంధాలు
వివేకాచూడామణి,బ్రహ్మసూత్ర భాష్యం,
ముండకోపనిషత్తు
సాధనా పంచకము నిర్వాణ శతకము మనీషా పంచకము
ఎన్నో ఎన్నెన్నో వేద ఉపనిషత్తుల భాష్యాలు
రచించి
కనకధారాస్తోత్రం తో పేద బ్రాహ్మణ స్త్రీ దారిద్ర్యం పోగొట్టిన  
ధర్మపరిరక్షణకై  దేశపర్యాటనచేసిన
శంకరులు ముప్పది మూడేండ్లు జీవించినా
సనాతన ధర్మ పరిరక్షకుడు
సాక్షాత్తు దివి నుండి భువికి దిగివచ్చిన పరమేశ్వర ప్రతిరూపమే
అందుకే మీరు సదా స్మరణీయులే.
వైశాఖ శుక్ల పంచమి మీ జయంతి రోజున
మీకివే నే నందిస్తున్న అక్షరకుసుమాలు...!!
............................


కామెంట్‌లు