వద్దు వద్దు యుద్ధమొద్దు
సద్దుమణికి ఉండలేరా
లోకమంతా తిరిగి చూడు
వికలకకలమవుతున్నదిరా
మనసు నిండ సెగలుగక్కుతూ
పగలతో రగలకండి మీరు
ఎగిసి పడే ఆ జ్వాలలతో
జనాలను వేధిస్తున్నారు
ఆపండీ ఆపండి యుద్ధమాపండి
దేశాలంటే కాదు చదరంగం
దేశ ప్రజలు కారు ఆట పావులు
జీవితాలు కావు గాలిపటాలు
ఒకరికొకరు తోడుగా నిలిచి
పంచుకోండి మంచి చెడులను
కరువు కాటకాలు పెంచవద్దు
కలిసిమెలిసి మీరు నడవండి
దీరుల వెనుక చోరులు చేరి
చేస్తారు ఎన్నెన్నో ఘోరాలు
దేశా ప్రజల మేలు కోరండి
యుద్ధాన్ని మీరు ఆపండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి