తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ చరిత్ర పూర్తి స్థాయిలో రికార్డు చేయాలి.

  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటికీ తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్ర గ్రామస్థాయి నుండి పార్లమెంటు వరకు జరిగిన మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పూర్తిస్థాయిలో రికార్డు చేయాలని, తెలంగాణ రచయితలు నవలలు,కథలు, వ్యాసాల రూపంలో రాసినప్పటికీ ఇంకా మారుమూల పల్లెలవరకు సబ్బండ వర్ణాలు చేసిన ఉద్యమంను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు డా.వాసరవేణి పరశురాం అన్నారు.
      తేదీ 08-04-2026  రోజున మధ్యాహ్నం సిరిసిల్లలో సామాజిక సేవకులు,మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న  "సిలుముల జయవర్థన్" పై రాసిన కరపత్రం వారి తల్లి సిలుముల నాగమల్లవ్వ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
           ఈ సందర్భంగా డా.వాసరవేణి పరశురాం మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చరిత్ర రాస్తున్నాననీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలంతా ఏకమై కదిలి సాధించుకున్నారనీ గర్వకారణం అన్నారు. కవులు, రచయితలు, మేధావులు అందరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని అన్నారు.
     ఈ కరపత్రం ఆవిష్కరణలో సిలుముల నాగమల్లవ్వ ,తెవిరసం అధ్యక్షుడు డా.వాసరవేణి పర్శరాములు, సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు, సిలుముల జయవర్థన్, నగునూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు