***
"అవ్వా! అవ్వా! గియ్యాల మా సారు బాచిగాడ్ని మస్తు దిట్టిండు తెల్సా?"
"ఎందుకురా బుడ్డోడా? గాడేం శితిని పనిజేసిండు? సార్లు ఊకూకెనే ఎందుకు తిడ్తరు?"
" మా అందరి నోటుబొక్కులు దిద్ది రైష్టు గొట్టి ఇచ్చిన గాడి బొక్కును సూశి దిద్దుకుంట తిట్టిండవ్వా!"
గాని రాతల్ల తప్పులున్నయేమో యాడాది పొడుగూత సద్వు నేర్సుకున్న తప్పులు తప్పులు రాత్తే తిట్టక ముద్దు వెట్టుకుంటరా ఏంది?"
"నీ యవ్వ! గదిగాదె! నన్ను శెప్పనియ్యి! మాకు డిట్టేషన్ ఎప్పుడు జెప్పినా గాడికే ఎక్కువ మార్కులొత్తయి. సారెప్పుడు గాన్ని జూపిచ్చి గాని లెక్క తప్పులేకుండా రాయాలె. సక్కగ సద్వాలె,వాని నాయిన సుత మస్తు సద్వేటోడు. నాయిన లెక్కనే గీడు సుత" అని మెచ్చుకుంటడు."
"గాడు మంచిగ సద్వుతడు,రాత్తడని సారన్నడని నువ్వే జెప్తున్నవ్? మల్లెందుకు తిట్టిండ్రా? ఏమో పో నువ్వు జెప్పేదేందో నాకస్సలు అర్తం కాట్లేలేదురా బుడ్డోడా?"
అవ్వా! జెర సైసు. గాన్ని ఎందుకు తిట్టిండంటే గాడి నోటుబొక్కులో అచ్చరాలన్ని చీమల్లెక్క,కంట్లె నలుసుల్లెక్కున్నయి. సారు కండ్లజోన్ని ఎన్ని త్యేపల పైకి కిందికి అనుకుండో! ఇంగ శివరాకరికి గాన్ని లేపి తిట్టిండు. అచ్చం మీ అయ్య లెక్కనే తయారైనవ్ రా! మీ నాయిన ఐదు పేజీలది ఒక్క పేజిల్నే గిలిపి గిలిపి రాశేటోడు." అని ఇంకేందో సుత అన్నడవ్వా! అస్సలు యాదికి రాట్లే" తల్కాయ గోక్కుంట అంటున్న బుడ్డోన్ని జూసి నవ్వుకుంట...
ఓష్నీ! గదా సంగతి! "గా తాను ముక్కే అన్నడా? లేకుంటే"గా మొద్దులోదే ఈ పేడు" అన్నడా? ఏమన్నడ్రా మీ సారు?'
ఓ అవ్వోవ్ ! భలే శెప్పినవ్! సారు గియ్యి రొండు అన్కుంట తిట్టిండు.గని నాకస్సలు అర్తం కాలే."
అన్న బుడ్డోడికి "అంటేందవ్వా? నాకు సుత అర్తం కాలే. అంటున్న భూలచ్మికి...
"మనం బట్టల దుకణంలకి ఎల్లినప్పుడు డరుసుల కోసం పేద్ద తాన్ల నించి బట్టని కొనుక్కుంటం సూడు.గా తీస్కున్న ముక్క, గా తానంత ఒక్క తీర్గనే ఉంటది గద. గట్లనే మొద్దు లోంచి తీసే పేడు సుత గట్లనే దానికి దానికి ఏం బేదం లేదని శెప్పడానికి గీ సామెత కాయించిండ్రు.'"
"అంటే గాని అయ్య బుద్ధులే ఆనికి సుత వొచ్చినయని అర్తం కదవ్వా!"
"గందుకేనా అవ్వా! మా బాచి గాడు కుయ్యన్లే,కయ్యన్లే. బుడ్డోడు అంటుంటే.."
"అవ్వా గా నడ్మల గదేదో సిన్మాలో జూశిన వాళ్ళ నాయిన లెక్కనే జేత్తడు.ఐదు పైసల కోసం ఐదుగంటలు బర్ఫుగడ్డ మీద కూసుంటడు"గట్లనేనా? అప్పటిదనుక ఆడికొచ్చి ఇంటున్న కొడుకుతో..."
"అవున్రా అయ్యా! గా సైన్మేమో గని గిప్పుడు ఊల్లె పెత్తనాలు జేసే రాజకీయ నాయకులు సుత గీ పార్టీ గా పార్టీ అనకుండ అందరు ఒక్క తాను ముక్కలే అయ్యిండ్రు. మాటలే గని శేతల్లేవు" అంది అవ్వ.
గదండీ సంగతి ''ఆ తాను ముక్కే అన్నా, "ఆ మొద్దులోదే ఈ పేడు అన్నా "గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి