తూరుపుదిక్కున
దూరాన నింగిలో
ఎరుపు రంగులు నింపి
మెరిసే కన్నులతో.....
రాబోవు రాజుకు
బహుపరాకులు చెప్పాలని
వేచిన గగనానికి
వేడుక తీరగా.....
కొండల నడుమ కొత్త వెలుగు
కొంచెం కొంచెం ఎదుగుతూ
అపరంజి ముద్దలా
అమితమైన వెలుగిస్తూ
మెరిసే కాంతులతో
నింగి ముంగిట నిలిచిన
పగడపు బంతిలా
ప్రభను ప్రసరిస్తూ.....
ఏతెంచి భువికి
కిరణ కరచాలనము చేసి
సకల జీవులకు
చేతనత్వము కలిగిస్తూ
కొత్త ఆశలు తీరగా
కొత్త దారులు తెలిసే
కొత్త వెలుగును ఇచ్చి
కొత్తగా బ్రతకమని దీవించు
వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి