అలజడులు లేని
అందాల దీవికి
ఆకాశ మార్గాన
ఆనంద విహారం
దూరమెంతైనా
అలవని బలం
తీరం చేరేదాకా
నిలవని పయనం
రెక్కలపై నమ్మకం
రేపటిపై విశ్వాసం
వెరపు లేక ఎగిరిపోవు
స్వేచ్చా జీవనం
సంకెలలు లేని
సందేహాలు రాని
సంతోషమొక్కటే
సొంతమైన జీవితం
కలతలెరుగని సీమలు
కలిమి నిచ్చే కోనలు
కరువులేని తావులలో
కలిసి బ్రతికే జాతులు
స్వార్ధమెరుగని గుణం
సాయమడుగని బలం
సమూహమన్న మాటకు
సరి అయిన బ్రతుకులు
వినువీధిని హాయిగా
విహరిస్తూ వేయిగా
విహగాళి చేసే సవ్వడి
వేకువకు అవే సందడి
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి