మారుమూల పల్లెటూర్లలో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్నీ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలనే చేర్చాలని ఆశపడుతున్నారు. ఫలితంగా ఎక్కడ పడితే అక్కడ ఇంగ్లీషు మీడియం స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. కానీ వాటిని నిర్వహించడం ఆషామాషీ వ్యవహారమేం కాదు. కత్తి మీద సాము అనే చెప్పవచ్చు. మంచి టీచర్లు దొరకరు. నిరాక్షరాస్యులైన తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఉండటం వలన హోం వర్కుల బాధ్యత కూడా స్కూళ్ళ మీదే పడుతుంది. పరిసరాలు బాగుండకపోవడం, శుచి శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం, చుట్టు పక్కల వారు మంచి భాషను ఉపయోగించకపోవడం, ఉన్న విద్యార్థులు కూడా సరియైన ఫౌండేషన్ లేని విద్యార్థులవటం - ఇవన్నీ కూడా కొత్తలో స్కూల్ వాళ్ళకు సమస్యలే. విద్యార్థులు చదివే క్లాసుకీ, వాళ్ళకు ఉన్న విజ్ఞానానికి పొంతన ఉండదు. అటువంటి వారిని గుర్తించి, వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించి వారి విద్యను మెరుగుపరచాలి. ఈ క్రమంలో మంచి విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలి.
సాధారణంగా చిన్న క్లాసులలో చెప్పేదేం ఉంటుంది. వాళ్ళు నేర్చుకునేదెం ఉంటుంది.! అని చాలా మంది అభిప్రాయపడతారు. కానీ ఏ సంవత్సరం నేర్చుకోవాల్సిన పోర్షను ఆ సంవత్సరం నేర్చుకోకపోతే ఇక అది ఎప్పటికీ నేర్చుకోనట్లే. ఉదాహరణకు తప్పులు లేకుండా వ్రాయడం, చదవడం, మ్యాథ్స్‌లో బేసిక్స్ అన్నీ 5వ తరగతి లోపలే పరిఫెక్ట్ ఆయిపోవాలి. నీట్ హాండ్ రైటింగ్ అలవరచుకోవాలి. ఏ అక్షరం గీతకు పైన ఉంటుంది. , ఏ అక్షరం కిందకు వస్తుంది తెలియాలి. తెలుగు కానీ ఇంగ్లీషు కానీ చదివేటప్పుడు ఎక్కడ ఆపాలి. ఎక్కడ మొదలు పెట్టాలి
కామాలు పుల్ స్టాఫ్ట్‌ల ఉద్దేశ్యం తెలుసుకోవటం, వాటిని సరిగా ఆచరించేలా చూడటం ఇవన్నీ కూడా ప్రైమరీ స్థాయిలో నేర్చుకునేటటువంటివే ఆ తర్వాత క్లాసులలో వీటి ప్రధాన్యం గురించి చెప్పడానికి టైం ఉండదు. ఫిఫ్త్ క్లాసు లోపలే ఇవన్నీ నేర్చుకుని ఉంటే, హైస్కూలు స్థాయిలో నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. కాబట్టి అప్పుడు కష్టం ఉండదు.
ఇక పరీక్షా పేపర్ల విషయానికొస్తే అవి విద్యార్థులను కన్‌ప్యూజ్ చేసేవిగా, ట్విస్ట్ చేసేవిగా ఉండకూడదు. ఏ ప్రశ్న పత్రమైనా క్లాసులో యావరేజ్ స్టూడెంట్ చేసే విధంగా ఉండాలి. కానీ చాలా స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంకర్‌ను కూడా వ్రాయలేని స్థితిలో తయారుచేస్తున్నారు. టెక్స్ట్ బుక్‌లో లేసన్ వెనక ఉన్న క్వశ్చన్స్‌ను అదే అర్థం వచ్చేలా మార్చి ఇచ్చి పిల్లలను అయోమయానికి గురి చేస్తుంటారు. ఉదా:- మానవుని శరీర భాగాలను గుర్తించుము అని, 'మానవుని దేహ భాగాలను గుర్తించుము' అని మార్చడం, Rabbit అని వచ్చిన చోట Hare అని మార్చడం చేస్తారు. multiple choice questions కు కింద options ఇవ్వకుండా మీరే ఆన్సర్లు వ్రాయండి అని చెప్పడం, match the following లో రెండింటిని కలిపి గీతలు గీయనీకుండా, దానికి సంబంధించిన నంబరును బ్రాకెట్‌లో వేయాలనడం, రెండు మూడు తరగతులలో విద్యార్థులను కష్ట పెట్టటమే. పాఠ్యపుస్తకాలు తయారు చేసేటప్పుడు ఏ ఏ వయసుల వారికి ఎలాంటి ప్రశ్నలు ఇవ్వాలని అని లోచించి తయారు చేస్తారు. ఆ పాఠ్య పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా ఇస్తే చాలు 'టీచర్లు విద్యార్థులను తికమక పెట్టే ప్రశ్నలు ఇవ్వకుండా ఉంటే మంచిది క్లాసులో ఒకరిద్దరూ మాత్రమే చేయగలిగిన విధానాలనుపయోగించే చేసే ప్రశ్నలను ఇవ్వకూడదు. ఇలాంటి క్వశ్చన్ పేపర్‌ను పరీఓలకు ఇచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంకర్ చేసున్నాడు కదా!. నీకెందుకు రాదు నువ్వు కూడా ప్రయత్నం చెయ్యి' అని ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు పిల్లల మీద ఫోర్స్ తెస్తారు. అది చేయలేకపోయినా బలవంతంగా చాలా కష్టపడి వాటిని వేర్చుకుంటారు. ఆయా క్లాసులకు ఉన్నాదాని కంటే ఎక్కువ నేర్చుకోవడం ఎక్కువ స్ట్రెయినుకు గురి చేయడమే అవుతుంది. చాలా కష్టపడి చేసినవి చూసి, టిచర్ నేను కష్టమైనవి ఇచ్చిన పిల్లలు బాగానే చేస్తున్నారు అని ఈసారి ఇంకా కష్టమైనవి ఎన్నుకుంటున్నది. మరల విద్యార్థికి, తల్లిదండ్రులకు కష్టాలు మొదలు. ఏ క్లాసుకు ఎలాంటి Questions ఇవ్వాలి? , ప్రశ్పపత్రం ఏ విధంగా ఉండాలి అన్నవాటిపై టీచర్లకు అవగాహన లేకపోవడం యాజమాన్యాలకు టీచర్లపై నియంత్రణ లేకపోవడం వలన జరుగుతున్నది. ఇలా పిల్లల్నీ ఆనవసర ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు.
ఇక్కడ తల్లిదండ్రులకు కూడా ఒక మనవి. ప్రతి పేరెంట్‌కు మేధావులైన పిల్లలే కావాలి. అందరూ మరి అబ్బాయికి ఫస్ట్ ర్యాంకు అని చెప్పుకోవాలని చూస్తారు. క్లాసులో ఉన్న నలభై మందికీ ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? ఫస్ట్ ర్యాంకు రానంత మాత్రన పిల్లవాడు దేనికి పనికి రాడా! ఇలా ఆలోచించే ముందు ప్రతి తల్లిదండ్రి కూడా ఉన్నత చదువులు చదివారా! అందరికీ ఫస్ట్ ర్యాంకులు వచ్చాయా! అందరూ ఒకే విధమైన స్థానాల్లో ఉన్నారా! అని ఆలోచించాలి అంటే మేం చదవకపోతే పిల్లలు చదవగూడదా! అని అడగవచ్చు. ఇక్కడ ఉద్దేశ్యం అది కాదు. మనలో ఎన్ని వైవిద్యాలు ఉన్నాయో పిల్లల్లో కూడా అలాంటి వైవిధ్యాలే ఉంటాయి. అందరూ ఒకేలాగే ఉండరు అన్న విషయం అర్ధం చేసుకుంటే చాలు. కేవలం మార్కులు మాత్రమే వారి సామర్ధ్యానికి కొలబద్ద కాదు. పిల్లల్లో కొన్ని సామ ర్ధ్యాలు నిగూఢంగా ఉంటాయి. వాటిని గుర్తించి ప్రోత్సాహించాలి. అంతే కానీ వాళ్ళ చేశారు. వీళ్ళు చేశారంటూ పిల్లలపై ఒత్తిడి తేకూడదు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూర్చొని, పిల్లవాడి సామర్థ్యాన్ని బట్టి చదివించాలి. వారిపై అనవసర భారం రుద్ద కూడదు. ఇలా ఆలోచించి ముందడుగు వేస్తే పిల్లలందరూ సంతోషంగా ఉంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి