అశ్వత్థామ క్రూరత్వం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అశ్వత్థామ కి  మహాశివానుగ్రహం ఉంది.అందుకే ఓభూతం అతని ముందు ప్రత్యక్షమైంది. సర్వత్రా అది అతనికి కన్పడుతోంది. దానిపై ఎన్ని ఆయుధాలువేసినా అవన్నీ వ్యర్ధమైనాయి. ఇక శివుని ప్రార్ధించాడు. అంతే,ప్రమధగణాలు ప్రత్యక్షమైనాయి. కానీ అశ్వత్థామ బెదరలేదు చెక్కు చెదరలేదు. రగులుతున్న అగ్నిలో దూకాడు. ఆశ్చర్యం! పరమశివుడు ప్రత్యక్షమై  కత్తిని ప్రసాదించాడు. అంతే పాండవుల శిబిరంలో ప్రవేశించి ధృష్టద్యుమ్నుని నిద్ర లేపి"నీవు నాతండ్రిని గురువైన ద్రోణుని క్రూరంగా చంపావు. ఇప్పుడు నిన్ను చిత్ర హింసలు పెట్టి చంపుతా" అని నరికి పోగులు పెట్టాడు.అతని తమ్ముళ్లు ఉత్తమౌజ, యుధామన్యుల్ని కూడా చంపాడు.ధర్మరాజు కొడుకుప్రతివింద్యుడు,భీముడి కొడుకు శ్రుతసోముడు, నకులుని కొడుకు శతానీకుడు, సహదేవుని కొడుకు శ్రుతసేనుడు, అర్జునుడి కొడుకు శ్రుతకీర్తి  అంటే ఉపపాండవులను క్రూరంగా చంపాడు.శిఖండి తల నరికి దేహాన్ని రెండుముక్కలు చేశాడు. పీనుగులపెంటలా మారింది.రక్తపుటేరులు పారాయి. మిగతావారిని కృపాచార్య కృతవర్మలు చంపారు.అలా అశ్వత్థామ అరివీరభయంకరుడై నిలిచాడు🌹
కామెంట్‌లు