చాలా కాలం తర్వాత ఆ మనిషి మళ్ళీ ఆ చెట్టు వద్దకు వచ్చాడు. అతనిని చూడటంతోనే చెట్టు "క్షమించు......నీకివ్వడానికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. నా చెట్టుకున్న ఆపిల్ పండ్లన్నీ అయిపోయాయి." అంది.
అయితే అతను "ఆపిల్ పండ్లు తినే స్థితిలో లేను. నా పళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి" అన్నాడు.
"నా కొమ్మలన్నీ బలహీనపడి పోయాయి...దానికి చూపుడు ఊయల లేదు నువ్వు ఊగుదామనుకుంటే" అంది చెట్టు.
"ఊయల ఊగే వయస్సు కాదు నాది. నేను ముసలివాడిని అయిపోయాను" అన్నాడు అతను.
"నా కాండమూ పోయింది. నువ్వు ఎక్కలేవు" అంది చెట్టు.
"ఎక్కే వయస్సూ కాదు నాది. నాకస్సలు ఓపిక లేదు. చాలా అలసిపోయాను" అన్నాడు అతను.
"క్షమించు. చాలా కాలానికి వచ్చిన నీకు ఏదైనా ఇవ్వగలిగితే బాగుండేది... కానీ నా దగ్గర ఏమీ మిగల్లేదు. నేను ఒక ముసలి మొద్దును. నన్ను క్షమించు..." అని
నిట్టూర్చింది చెట్టు.
అప్పుడతను "నాకు ఇప్పుడు పెద్దగా ఏమీ అవసరం లేదు...కేవలం కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రశాంతమైన చోటు. నేనెంతో అలసిపోయాను." అన్నాడు.
"సరే," అంది చెట్టు, తనను తాను వీలైనంతగా నిటారుగా చేసుకుంటూ.
"కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి ఒక ముసలి మొద్దు మంచిదే కదా...రా, కూర్చో. సేదదీరు" అంది చెట్టు.
అతను అలాగే చేశాడు. ఆ చెట్టు సంతోషించింది.
- ఇంగ్లీషులో ఒకరు పంపగా నాకర్థమైంది రీతిలో మలిచాను. మూల రచయిత పేరు తెలీలేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి