శ్రీమద్రామాయణము బాలకాండం : - ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
దేవతలంతా రాముని చుట్టు 
ప్రదక్షిణలు చేసి నిలిచిరట 
రామా నీవు చేసే కార్యములలో 
సహాయపడుతూ ఉంటాము 
మీకు కార్యదీక్షలో విజయము కలగాలి

దేవతలందరూ రాముని వద్ద 
సెలవు నొంది వెళ్ళినారు
శుభలక్షణ శోభితుడైన రాముడు
విశ్వామిత్రు ని ఆజ్ఞ అనుసారము నడుస్తూ
యజ్ఞ రక్ష దీక్షుడై నిలచినాడు శ్రీరాముడు 

రాముడు నేర్చిన మంత్రములన్నియు 
లక్షణముగా లక్ష్మణునికి బోధించినాడు
రామలక్ష్మణులు ఆ మంత్రములను 
చక్కగా గ్రహించి ముని వెంట పయనించినారు 

ఈ అడవి పర్వతాలతో వృక్షాలతో విలసిల్లుచున్నది 
వివిధ మృగాలతో రకరకాల పక్షులతో 
కిలకిల రాగాలు వీనుల విందు చేస్తున్నాయి  
తాటకి వనము నుండి వెలుపలకొచ్చినట్టుంది

ఇచ్చటున్న ఈ ఆశ్రమము ఎవరిది స్వామి 
ఆ రాక్షసులను వధించే ప్రదేశము ఇదేనా
ఓ మునివర్యా వివరముగా తెలుపుమాకు 
మీ యజ్ఞం నిర్వహించు స్థలము చూపు స్వామి 



కామెంట్‌లు