నీ కళ్ళకు దిద్దిన కాటుక
నామదిలో రేపెను కోరిక!
నీ చేతికి తొడిగిన గాజులు
నాలో పెంచెను మోజులు!
నీ నుదుటిన పెట్టిన బొట్టు
నా మనసును కలవరపెట్టు!
నీ పెదవికి లిప్స్టిక్ దిద్దు
ఏదీ నా అందానికి హద్దు!
నీ జడలో తురిమిన మల్లి
నా మనసును కలవరపెట్టును
మళ్లీ ...మళ్ళీ....!
నువ్వు కట్టిన నీలిరంగు కోక
ఎలావుంటుంది
నా మనసును దోచుకోక!
నువ్వు చీర కట్టిన టైపు
నాలో రేకెత్తించెను కైపు !
నీలోఇంత అందాన్ని చూసిన నేను
పిచ్చివాడిని కాక ఏమవుతాను!!
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి