తెలి వెలుగుల తాకిడికి
నులివెచ్చని రెప్పలు తెరిచి
తొలి నవ్వులు చిలికిస్తూ
తీగ ఊయలలూగే విరులు
గలగలమని సాగుతూ
పరుగుపెడుతున్న ఏరు
పలకరించిన పూలపై
చిలకరిస్తూ నీరు చేసే అల్లరి
కనక కాంతికి తళుకుమనే
బిందువులు చిందించే
సొయగాలు చూసి
మురిసిపోయిన మొక్కలు
ఆణువణువునా అవనిలోని
అవధిలేని అందాలను
అవధరించు మనసుకు
అదుపులేని ఆనందం
చిన్ని సంతోషాలతో
పెద్ద మూటలు కట్టి
కొన్ని క్షణాలయినా
మిన్నగా ఉండాలని...
ఊగే పూల గుత్తులు
సాగే నీటి వాగులు
మెరిసే చిన్ని చినుకులకు
సొగసులద్దే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి