పిల్లకోతి! :- అచ్యుతుని రాజ్యశ్రీ

 అడవిలో కోతులమం దా ఉంది ఓ పెద్ద కోతి ముసలిదైపోయి పిల్ల కోతులకు రోజు మంచి మంచి కబుర్లు చెప్పేది ఒకరోజు అవన్నీ పైన ఎగిరే పిట్టల్ని చూస్తూ తాత మేం కూడా అలా ఎగరాలి అని అనుకుంటున్నాం అన్నాయి దానికి కోతి తాత నవ్వుతూ దేవుడు మనల్ని నాలుగు కాళ్లతో ఎగరమని దూకమని శక్తిని ఇచ్చాడు పక్షి లాగా ఎగరలేము అలా పిచ్చి ఆలోచనలు చేయొద్దు అని హెచ్చరించాడు అయినా ఓ పిల్ల కోతి గబగబా అక్కడ ఉన్న పెద్ద పెద్ద రెండు అరిటాకులు పోసుకుని తన ముందు కాళ్లకు వెనక కాళ్లకు గట్టిగా తాళ్లతో కట్టి ఎగరాలని ప్రయత్నించింది కానీ అది అసాధ్యం కదా అరిటాకులు చిరిగి పీలికలు అయినాయి అదృష్టవశాత్తు పిల్ల కోతి బురదగుంటలో పడి గిలగిల తన్నుకో సాగింది అప్పుడు తాత కోతి ఒక పొడుగాటి తాడు తీసుకొచ్చి దాని పైకి విసిరి గట్టిగా పట్టుకోమంది రెండవ కొసని చెట్టుకు కట్టేసి కోతులన్నీ దాన్ని ప్రోత్సహిస్తూ పైకి రమ్మని అరవసాగాయి ప్రాణ భయంతో ఉన్న పిల్ల కోతి ఆ తాడుని గట్టిగా పట్టుకుని అలా వేలాడుతూ ఉండగా అన్ని కోతులు కలిసి ఆ తాడుని పైకి లాగాయి ఒంటినిండా బురదతో ఉన్న పిల్ల కోతి బతుకు జీవుడా అని బయటపడింది తాత కోతి దాని ఒళ్ళంతా శుభ్రంగా ఆకులతో తుడిచి పక్కనున్న నేటి చలమలోంచి నీరు తీసుకొచ్చి పిల్ల కోతికి తాగించింది నిస్సహాయంగా నీరసంగా పడుకుందా పిల్ల కోతి అప్పుడు కోతి తాత ఇలా అంది పెద్దలు చెప్పిన మాట సద్ది మూట ఎప్పుడు మనకు చేతకాని పని చేయాలని ప్రయత్నించరాదు పూర్వం ఒక కోతి ఇలాగే అక్కర్లేని పని చేసి తన కాళ్ళని రెండు చెక్క ముక్కల మధ్య పెట్టి నలగ కొట్టుకుంది అదృష్టవశాత్తు బతికి బయటపడిన అది జీవితాంతం కుంటిగానే బతుకు ఏడ్చింది పెద్దల మాట వినాలి అనేటప్పటికీ కోతి పిల్లలన్నీ"అలాగే తాతా! నీవు ఎలా చెప్తే అలా చేస్తాం.కానిపనులజోలికి పోము" అని చెంపలు వాయించుకున్నాయి🌹
కామెంట్‌లు