మొగలులకాలంలో మూడు సార్లు కొత్త సంవత్సర సంబరాలు! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 మనదేశ చరిత్ర లో మొగల్ వంశపాలనకి ప్రత్యేక స్థానం ఉంది. ఫారశీ పరంపరాచారాలు, ఇస్లాంకాలెండర్, భారతీయ పండుగలు, ఇక్కడి ఆచార వ్యవహారాలతో ముడిపడి తమపాలనలో మూడుసార్లు కొత్త ఏడాది జరిపేవారు. ఆపండుగ ఉత్సవాలు ఏమంటే హిజరీ చంద్రుడి ఆధారంగా పండగ,ఫసలీ( జాలాలీ) సూర్యుడు వ్యవసాయసంబంధమైనది, రాజ్యపాలన కి సంబంధించిన పండగ! మొగల్ పాదుషాలకు కొత్త వత్సరం కేవలం ఉత్సవం కాదు, తమ సత్తా భుజబలంచాటడం, పాలనావ్యవస్థకి సంబంధించినది కావటం  తో ఘనంగా అక్బర్ జహంగీర్ ప్రత్యేక శ్రద్ధతో ఎర్ర కోటను ఫతేపూర్ సిక్రీ మొదలైన వాటిని చాల అందంగా అలంకరణ చేయించేవారు.వరండా,హాలులో రంగు రంగుల వస్త్రాలు,పట్టు తెరలు ఫారసీ కంబళ్లు,పూల మాలలతో అత్తరు సెంట్ల ఘుమఘుమల తో కొత్త ఏడాది సంబరాలు ప్రారంభమయ్యేవి  .గోడలపై అందమైన చిత్రాలు,రాతలు, మొగల్,ఫారశీమిశ్రమ కళలతో మిరుమిట్లు గొల్పేవి. పాదుషా దర్బార్ లో ఆసీనుడైతే  అమీర్,ఉమరా, సుబేదారు ,కాజీ హాజరై తమ ప్రతిభను ప్రదర్శించేవారు. దర్బారు జనాలు పాదుషాకి బంగారం వెండి,పాత్రలు,నగలు,గుర్రాలు,ఆయుధాలు, కురాన్ ప్రతులు బహుమతులుగా ఇచ్చేవారు.పాదుషా కూడా వారికి ఉన్నత పదవులు, జాగీర్లు, ధనపురాసులిచ్చేవాడు. రాజనీతిలో భాగం ఇది.
ఫసలీ,జాలాలీ అనే నూతన సంవత్సర వేడుకలు అక్బర్ ప్రారంభించాడు.జాలాలీ సాల్ ( తారీఖ్ ఎ ఇలాహీ అనే పేరుతో వసంత ఋతువులో  పంటకోత తర్వాత  ఈకొత్త సంవత్సరం ఆరంభమయ్యేది. జమీందారులు సుబేదారులు పన్నువసూలు సిస్తు అన్నీ లెక్కలు సరిచూసుకునేవారు. కొత్త ఖాతాలు తెరిచేవారు.అక్బర్ ఆరోజు హిందూ జైన పార్శీ మొదలైన మతాలవారిని దర్బార్ కి ఆహ్వానించేవాడు. 🌹
కామెంట్‌లు